సన్నివేశం

మా కార్యక్రమాలు

ప్రాథమిక ఉన్నత పాఠశాల కార్యక్రమం 🪔

సన్నివేశం బృందంగా మేము ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రతిభా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా మేము అందమైన అక్షరరచన, చిత్రలేఖనం, ఆటలు, పఠనం, రచన, కథ చెప్పడం వంటి అనేక ఆసక్తికర కార్యక్రమాలను నిర్వహించాము.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారూ, ఉపాధ్యాయులు అందించిన సహకారం ఎంతో అమూల్యమైనది. వారు అందరూ ఎంతో ఆదరణతో మమ్మల్ని ప్రోత్సహించారు.

అలాగే మేము విద్యార్థులకు తెలుగు భాష మహత్త్వం మరియు మన సంస్కృతి గొప్పతనం గురించి తెలియజేశాము.

ఈ కార్యక్రమం ద్వారా మాకు మంచి అనుభవం లభించింది. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానోపాధ్యాయురాలు గారికి, ఉపాధ్యాయులకు మరియు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.