ప్రతిభా వేదిక 🎭
విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ఒక అందమైన ప్రయత్నం ✨

ప్రాథమిక ఉన్నత పాఠశాల కార్యక్రమం 🪔

సన్నివేశం బృందంగా మేము ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రతిభా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా మేము అందమైన అక్షరరచన, చిత్రలేఖనం, ఆటలు, పఠనం, రచన, కథ చెప్పడం వంటి అనేక ఆసక్తికర కార్యక్రమాలను నిర్వహించాము.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారూ, ఉపాధ్యాయులు అందించిన సహకారం ఎంతో అమూల్యమైనది. వారు అందరూ ఎంతో ఆదరణతో మమ్మల్ని ప్రోత్సహించారు. వారి నుండి మేము అనేక విషయాలు నేర్చుకున్నాము.

అలాగే మేము విద్యార్థులకు తెలుగు భాష మహత్త్వం మరియు మన సంస్కృతి గొప్పతనం గురించి తెలియజేశాము.

ఈ కార్యక్రమం ద్వారా మాకు మంచి అనుభవం లభించింది. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానోపాధ్యాయురాలు గారికి, ఉపాధ్యాయులకు మరియు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

⬅ తిరిగి వెళ్ళండి